15 April, 2026 | 12:54 AM

క్రీడాకారులు గెలుపు ఓటములను చూడరాదు

22-11-2025 03:29 PM

జిల్లా విద్యాశాఖ అధికారి రాజు

కామారెడ్డి,(విజయక్రాంతి): క్రీడాకారులు గెలుపు ఓటములను చూడకుండా క్రీడల్లో పాల్గొనాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. శనివారం కామారెడ్డి సరస్వతి శిశు మందిర్ హైస్కూల్లో క్రీడా భారత్ ఆధ్వర్యంలో అండర్ 14 ,17 క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో గెలుపు ఓటమిలను చూడకుండా తమను క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు పోటీలు దోహదపడతాయన్నారు. అదే ఉద్దేశంతో ప్రతి క్రీడాకారుడు క్రీడ పాల్గొనాలని సూచించారు.