calender_icon.png 22 November, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు కల్లాల వద్ద కంటి ఆరోగ్యం అవగాహన సదస్సు

22-11-2025 03:11:03 PM

చిత్ర మిషన్ ఐ కేర్ ఫౌండర్, చైర్మన్ దాస్ రెడ్డిమల్ల

ఖానాపూర్ (విజయక్రాంతి):  రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను నూర్పిడి చేస్తున్న సమయంలో కల్లాల వద్ద రైతులు తమ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిత్ర మిషన్ ఐ కేర్ ఫౌండర్, చైర్మన్ ఏసుదాస్ రెడ్డి మల్ల అన్నారు. శనివారం  మండలంలోని పాత తర్లపాడు, మేడంపల్లి, గ్రామాలలో రైతు కల్లాల వద్ద కంటి ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి ఆరోగ్యం, రక్షణ కోసం తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు సూచనలు చేశారు. కంటి చూపు సరిగా ఉంటే జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవచ్చునని ఆయన సూచించారు. ఆయన వెంట సంతోష్ ,మల్లేష్ ,రైతులు పలువురు ఉన్నారు.