22-11-2025 03:14:30 PM
దేవరకొండలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం దేవరకొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మహిళలకు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని వారు తెలిపారు.
మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి, కుటుంబ ఆర్థిక శ్రేయస్సును బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందనీ,అందులో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఒక గొప్ప ముందడుగు అని వారు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఉచితంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు.దేవరకొండ నియోజకవర్గంలో 68,000కు పైగా చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.