22-11-2025 02:07:35 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం పెద్దకాపర్తి స్టేజి వద్ద జాతీయ రహదారి 65పై శనివారం ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్యాసింజర్ ఆటో కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. చిట్యాల మండలంలోని పేరపల్లి గ్రామానికి చెందిన అంతటి రవి (36) ప్యాసింజర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చిట్యాలకు కిరాయి కోసం వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు రహదారి పక్కన ఉన్న కాలువలో ఆటో పల్టీ కొట్టి తీవ్రంగా గాయపడిన అతడిని సమయానికి ఎవరు చూడకపోవడం వలన మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న చిట్యాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు కూతురు ఉన్నారు.