16 July, 2026 | 2:01 AM

ఎల్‌నినో ప్రభావంపై అవగాహన

16-07-2026 01:58 AM

మధిర, జూలై 15 (విజయక్రాంతి): రైతులకు పంటలపై ఎల్ ని నో ప్రభావంపై అవగాహన కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి దనసరి పుల్లయ్య మండలంలోని వివిధ గ్రామాల్లో సందర్శించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా వానాకాలం సీజన్లో స్వల్పకాలిక తక్కువ  నీటితో అధిక దిగుబడును ఇచ్చే పంట రకాలను ఎంచుకోవాలని అన్నారు.

ప్రత్యామ్నాయ పంటలైన పెసలు, మినుములు, కందులు, జొన్నలు ఇతర చిరుధాన్యాల పంటలు పండించాలని సూచించారు. జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు పెంచేలా రైతులు ఫార్మ్పండ్స్ (పంట కుంటలు) ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వీబీజీ రామ్ జీ పథకం ద్వారా 100% రాయితీపై అందిస్తుందని,ఈ ఫార్మ్ పాండ్స్(పంట కుంటలు) పథకాన్ని రైతులందరూ అధిక మొత్తంలో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్ వివిధ గ్రామాలు రైతులు పాల్గొన్నారు