19 April, 2026 | 1:50 AM

విజ్ఞాన్స్ ప్రవేశ పరీక్షకు అనూహ్య స్పందన

19-04-2026 12:13 AM
  1. అర్హత సాధించిన 42 వేల మంది

ఏప్రిల్ 22 నుంచి 27 వరకు కౌన్సిలింగ్

ఇంచార్జీ వైస్ చాన్సలర్ ప్రోఫెసర్ క్రిష్ణ కిషోర్

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్ ఫేజ్ 1 పరీక్షకు అనూహ్య స్పందన లభించిందని, విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఇంచార్జీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా 61వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. 42వేల మంది అడ్మిషన్ పొందేందుకు అర్హత సాధించారని తెలిపారు.

1 నుంచి 50లోపు ర్యాంకులు సాధించిన వారి కి 50 శాతం స్కాలర్‌షిప్, 51 నుంచి 200 లోపు 25శాతం, 201 నుంచి 2000 పదిశాతం స్కాలర్‌షిప్‌ను నాలుగేళ్లపాటు అందజే స్తామని తెలిపారు. వీశాట్ పాటు జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకులు, ఇంటర్మీడియట్ మార్కులను కూడా పరిగణలోనికి తీసుకుంటామన్నారు. ఇంటర్‌లో 970కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 50శాతం, 950 నుంచి 969 మార్కుల విద్యార్థులకు 25శాతం, 920 నుంచి 949 మార్కుల విద్యార్థులకు 10శాతం స్కాలర్‌షిప్ అందజేస్తామని తెలిపారు.

85 శాతానికిపైగా విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడంతో విద్యార్థు లు, తల్లిదండ్రులకు యూనివర్సిటీపై ఆదరణ పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. జేఈఈఈ మెయిన్స్ 95 శాతానికి పైగా మా ర్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం స్కాలర్‌షిప్, 89 నుంచి 94.9 50శాతం, 80 నుంచి 88.9 శాతం విద్యార్థులకు 25 శాతం, 70 నుంచి 79.9 శాతం విద్యార్థులకు 10 శాతం స్కాలర్‌షిప్ అందజేస్తామన్నారు. గుం టూరు, హైదరాబాద్ క్యాంపస్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసమై ఏప్రిల్ 22 నుంచి 27 వరకు మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఎప్పటికప్పుడు పాఠ్యాంశాలను మారుస్తు, పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా సిలబస్‌తో, ప్రయోగశాలలకు, ప్రాజెక్టులకు అనుసంధానించడంతో విద్యార్థుల్లో బోధనను ఆసక్తిగా మార్చగలిగామని ఇంచార్జీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. ప్రత్యేక ట్రైనింగ్‌తో వందకు పైగా సంస్థ ల్లో విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డీన్ ప్రొఫెసర్ ధూళిపాళ్ల విజయకృష్ణ తెలిపారు.

అంతర్జాతీయ యూనివర్సిటీలతో ఒప్పందా లు ఉండ డం వల్ల తమ విద్యార్థులను అంతర్జాతీయ పోటీకి ధీటుగా తీర్చిదిద్దుతున్నామని, అద్భుత ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు వీలుగా విజ్ఞాన్‌లో ఇన్నోవేటర్స్ క్లబ్ ఉందని పీఎం వీరావు చెప్పారు. 12 దేశాల యూనివర్సిటీలతో అవగాహణ ఒప్పందాలు, 90 శాతం మంది విద్యార్థుల అద్భుత ప్రదర్శన, రూ. 20 కోట్ల నిధులతో పరిశోధనలు, గత ఐదేళ్లలో 4వేలకు పైగా రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ చేశారని రావు చెప్పారు.

ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ. 48 కోట్ల స్కాలర్‌షిప్ ఇచ్చామని డైరెక్టర్ అడ్మిషన్స్ ఏ గౌరీశం కర్ రావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 నుంచి 100 శాతం ఫీజు రాయితీ ఇస్తున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ ఇంచార్జి వైస్ చాన్సలర్ ప్రొ. కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎం వీ రావు, డిప్యూటీ రిజిస్ట్రార్, డైరెక్టర్ అడ్మిషన్స్ అప్పారి గౌరీశంకర్రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.

ర్యాంకులు సాధించిన విద్యార్థులు..

తిగుళ్ల సాత్విక్ సంగారెడ్డి జిల్లా, బానోత్ సంజయ్ ఖమ్మం, పీ మౌనిష్ కడప, చితి తోటి హోషిక్ ఎన్టీఆర్ జిల్లా, రాయపూడి జశ్వంత్ నాయుడు గుంటూరు, కే.సాకేత్ చౌహాన్ సంగారెడ్డి, దామెర్ల వెంకట సిద్ధార్థ రాయ్, గుంటూరు, గుంటోజు ఉమేష్ చంద్ర మేడ్చల్, సంగు భరత్ చంద్రారెడ్డి ప్రకాశం, ఎం.పూర్ణ చంద్రశేఖర్ విశాఖపట్నం.