19-08-2025 01:51:30 PM
బోయిన్ పల్లిలో ఘటన..13 గొర్రెలు మృతి..
మిడ్జిల్: మండల పరిధిలోని బోయిన్ పల్లి స్టేజి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం గొర్రెల మీదుకు దూసుకు వచ్చి ఢీకొట్టడంతో 13 గొర్రెలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గొర్రెల యజమాని కేశ కృష్ణయ్య వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తులేని వాహనం ఒక్కసారిగా గొర్రెలను ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డాయని, మరో మూడు గొర్రెలకు కాళ్లు విరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గొర్రెల విలువ దాదాపుగా రూ 1 లక్ష 30 వేల వరకు ఉంటుందని రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.