calender_icon.png 19 August, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఇంచార్జ్ మంత్రి జూపల్లి పర్యటన

19-08-2025 01:50:18 PM

వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన 

వర్షాకాలం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) బుధవారం పరిశీలించనున్నారు. మొదట రెబ్బెన మండలంలోని గోలేటి పెట్రోల్ పంప్ సమీపంలో వరద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఎన్టీఆర్ కాలనీ సందర్శించనున్నారు. అక్కడి నుండి దహేగాం మండలం పెసర కుంట గ్రామాన్ని సందర్శించనున్నారు. అనంతరం కాగజ్ నగర్ పట్టణంలోని శిథిలమైన నివాసాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామంలోని తెగిపోయిన కల్వర్టు సందర్శించాక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించనున్నారు.