24-06-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైం, జూన్ 23 (విజయ క్రాంతి): అంజలి రక్తనిధి సంస్థ లోగోను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్త దానం చేయడం ప్రాణదానంతో సమానమని రక్తదానం చేసి ఆపదలో ఉన్న మరోకరి ప్రాణదాతలుగా నిల వాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజలి రక్తనిధి సంస్థ సభ్యులు గోదరి జితేందర్, సభ్యులు తదితరులుపాల్గొన్నారు.