05-05-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే4 (విజయ క్రాంతి): కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. మంచిర్యాల నుంచి వాంకిడి (మహా రాష్ట్ర సరిహద్దు) వరకు రూ.3500 కోట్ల వ్యయంతో నిర్మించిన నేషనల్ హైవే 363 రోడ్డును జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా రెబ్బెన మండలంలోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ల్యాండ్ కానున్నారు.
అక్కడే నేషనల్ హైవే రోడ్డును ప్రారంభించి అనంతరం వాసవి కాటన్ మిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈకార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ , గోడం నగేశ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.