calender_icon.png 5 May, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15 మంది జూదరులు అరెస్ట్

05-05-2025 12:00:00 AM

ఆదిలాబాద్, మే 4 (విజయక్రాంతి): ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మినీ బాలాజీ ఫంక్షన్ హాల్ వద్ద పేకాట ఆడుతున్న 15 మందిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు శ్వసనీయ సమాచారంతో  పేకాట స్థావరం పై దాడి చేయగా, పేకాట ఆడుతూ 15 మందిని పట్టుకున్నట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్ తెలిపారు.

వారి నుండి పేకాట ముక్కలు, రూ.89,160/-నగదు, 13 మొబైల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడ్డ వాక్రిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు, యువత అసాంఘిక కార్యకలాపాలకు, చట్ట వ్యతిరేక పనులకు,  దుర్వ్యసనాలకు పాల్పడకూడదని సూచించారు.