బీసీ వర్గాల ఐక్యత అవసరం!
భారతదేశం స్వాతంత్య్రం పొంది 78 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ కాలంలో సంపన్నుల జాబితా, ప్రభుత్వ ఉద్యోగాలు, అధికార స్థానాలు చూస్తే ఒక స్పష్టమైన విషయం అర్థమవుతుంది. అదేంటంటే అన్ని అధికారాలు ఇప్పటికీ అగ్రకులాల ఆధిపత్యంలోనే ఉన్నాయి. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు (బ్యాక్‌వర్డ్ క్లాసెస్) ఎక్కువ ట్యా క్సులు కడుతున్నా, వారికి తగిన వాటా లభించడం లేదు. ‘మా జనాభా ఎంతో.. మా వాటా అంత’ అనే నినాదం ఇప్పటికీ కేవలం నినాదంగానే మిగిలిపోయింది. 50 శాతానికి పైగా జనాభాకు 50 శాతం నిధులతో సబ్ ప్లాన్ అమలు చేయడం ఇప్పటివరకు జరగలేదు. ఇప్పటివరకు దేశంలో రెండు రకాల నిర్మాణాలు జరిగా యి.
మొదటిది కాంగ్రెస్ నాయకత్వంలో ‘స్వాతంత్య్రానికి మేమే హక్కుదారులమని’ చెప్పుకునే నిర్మాణం. రెండవది బీజేపీ నాయకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్న హిందుత్వ నిర్మాణం. కానీ నిజమైన దేశాభివృద్ధి అంటే మెజారిటీ ప్రజల అభివృద్ధి కదా? అది బీసీల అభివృద్ధితోనే సాధ్యమ న్న విషయం గ్రహించాలి. బీసీ పాలనతో దేశాభివృద్ధి సాధ్యం. ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు సులభంగా ఇచ్చారు. దీనికి ఎలాంటి న్యాయ సూత్రాలు అడ్డురాలేదు. కానీ 50 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తు న్న బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు.
దేశ స్వాతంత్య్ర ఫలాలు, రాజ్యాంగ హక్కులు బీసీలకు వ్యతిరేకంగానే నిర్మితమవుతున్నాయి. 78 ఏళ్లలో బీసీలను బా నిసలుగా మార్చారు. ఓటు హక్కును స్వే చ్ఛగా వినియోగించుకోలేకుండా చేశారు. బ్రిటిష్ పాలన లాగా ‘విభజించు చు’ విధానాన్ని బీసీల మెదళ్లలో నాటారు. స్వాతంత్య్రం, రాజ్యాంగం, పంచవర్ష ప్ర ణాళికలు, నీతి ఆయోగ్.. ఏదీ బీసీల వెనుకబాటును తొలగించలేకపోయాయి. మీడి యా, వ్యాపారం, భూమి, రాజకీయ రంగా ల్లో బీసీలు ముందు వరుసలో లేరు. ప్ర భుత్వ వెబ్‌సైట్లలోనే ఈ సమాచారం ఉం ది. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు కాలేదు.
సమాన హోదా ఏదీ?
ఆర్థిక అభివృద్ధి గురించి ఏ ప్రభుత్వానికీ నిజమైన ఆలోచన లేదు. ప్రభుత్వం అంటే అందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వడం. దేశాభివృద్ధి అంటే ప్రతి కుటుంబానికి అవకాశాలు కల్పించడం. నాగరికత అంటే అనాగరికుణ్ణి నాగరికత్వానికి దగ్గర చేయడమే.. కానీ విద్యా విధానంలో మా ర్పులు ఎందుకు రాలేదు? ఆర్థిక వసులుబాటు ఎందుకు ఇవ్వలేదు? కులం పేరు తో చిన్న అవకాశాలు చూపి ఓట్లు వేయించుకోవడమే సంప్రదాయం అయిపోయిం ది. ప్రజాతంత్రం అంటే సామా జిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు. నాగరికత అంటే ప్ర తి పల్లెటూరిలో విద్య, ఆర్థిక అవకాశాలు ఉండాలి. కానీ ఇప్పుడు మనం చేస్తున్నదేమిటీ? నిరుద్యోగ యువత, మద్యం అమ్మకాలపై ఆధారపడిన రాజ్యాలు, ప్రాజెక్టుల పేరుతో నిధుల దోపిడీలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాలు ఉచిత విద్య, -వైద్యం ఇస్తుంటే, మన తరగతి గదులు, ఆసుపత్రులు మాత్రం ఇంకా దయనీయ స్థితిలోనే ఉంటున్నాయి.
కలసికట్టుగా నడవాలి..
బీసీల సంఖ్యా బలం చాలా పెద్దది. వారు శక్తివంతులు. అయితే బీసీలను ఓటు బ్యాంకులుగా మార్చిన ఘనత గత పాలకులకు దక్కుతుందనంలో సందేహం లేదు. కానీ ఈ శక్తి నిజమైన అధికారంగా మారలేదు. ఉపకులాల మధ్య విభజనలు చేశారు. పద్మశాలి, గొల్ల, కురుమ, గౌడ, మున్నూరు కాపు, ఎంబీసీ, సంచారజాతులు, అసలే గుర్తింపులేని వారు.. ఇవన్నీ బీసీల శక్తిని చీల్చివేస్తున్నాయి. ఒక ఉపకులం ఎక్కువ రిజర్వేషన్ కోటా కోసం పోరాడితే, మరొకటి బలహీనుల జాబితాలో చేర్చాలంటుంది. ఈ విభజన బీసీలను బలహీనపరుస్తోంది. రాజకీయ ఐక్యత కోసం బీసీలు త్యాగం చేయాలి. వ్యక్తిగత ఆశలను వదులుకొని, సామూహిక లక్ష్యాల కోసం ఎవరికి వారుగా ఉన్నప్పటికీ రిజర్వేషన్ల సాధన కోసం కలిసి నడవాలి.
బీసీలు స్వతంత్ర ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరముంది. బీసీలు ఆధిపత్య కులాల రాజ కీయ పార్టీల ఆధీనంలో ఉండకుండా, సొంత గొంతుకగా ప్రతిధ్వనించాలి. గ్రామీ ణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు త్యాగనీరతి గల నాయకత్వాన్ని పెంచడం అవసరం. బీసీ నాయకులు సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం, చేతివృత్తుల అభివృద్ధి పట్ల ఆధునిత టెక్నాలజీని మేలవింప చేసే దృష్టితో స్థానిక సమస్యలను చూడాలి. అందుకు పరిష్కరించే రాష్ట్ర విధానాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగాలి. ఈ లక్ష్యం కోసం బీసీ సంఘా లు.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాం స్కృతిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. యువతను ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వంలోకి తీసుకురావడానికి శిక్షణ కార్యక్రమాలు అవసరం.
బలమైన పోరాటం..
బీసీలు తమ శక్తిని బలోపేతం చేయాలి. ఈ పోరాటం ఒక విప్లవం. ఐక్యంగా నిలబడితే, రాజకీయ అధికారం మన బీసీల చేతుల్లోకి వచ్చే అవకాశముంటుంది. మెజారిటీ ప్రజల అభివృద్ధి బీసీల చేతుల్లోనే ఉంటుంది. అదే నిజమైన ప్రజా తంత్ర అభివృద్ధి. తెలంగాణ నుంచి మూ డోదశ నికార్సయిన పోరాటం మొదలుపెట్టి, బీసీ పాలనను సాధ్యం చేద్దాం. బీసీ లు రాజకీయ చైతన్యవంతులు కావాలి. గతంలో బీసీల హక్కుల సాధనకై పోరాడిన మేధావులు, రచయితలు, పౌరసం ఘాల నేతలు ఈ ఉద్యమాన్ని ఒక ఆలోచన నుంచి పోరాట దశ వరకు తీసుకు రావడంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు మనం వారి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరముంది.
అగ్రకుల వ్యా పార సామ్రాజ్యం యువతను వైన్ షాపు లు, పబ్బులు, ఈఎంఐలు, షేర్ మార్కెట్ల చుట్టూ తిప్పుతోంది. నిజమైన స్వాతం త్య్రం ఇంకా రాలేదు. రాజ్యాంగ ఫలాలు మెజారిటీ కులాలకు అందలేదు. కాబట్టి సరికొత్త భారత నిర్మాణం బీసీలతోనే సాధ్యం. బీసీలే రాజ్యాంగాన్ని కాపాడతారు. రాజ్యాధికారంతో కూడిన బీసీ పాలన అవసరం. అగ్రకులాలతో నిర్మితమైన కాంగ్రెస్ అలసిపోయినప్పుడు, అదే ఆలోచనలతో మరో పార్టీని నిర్మించి అధికారం మార్చుకున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను రాజ్యాధికార స్థానా ల్లో ఉంచలేదు. గ్రామస్థాయిలో పార్టీల రిమోట్ కంట్రోల్ ఇప్పటికీ అగ్రకులాల చేతుల్లోనే ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడాలంటే, తెలంగాణ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పాలకులుగా మొదలుపెట్టి, విశాల భారత నవనిర్మాణం చేద్దాం. హటావో, బచావో, మూడవ దశ నవ నిర్మాణం బనావో!.
వ్యాసకర్త సెల్: 9000770884
అవ్వారు వేణుకుమార్






