15 April, 2026 | 12:33 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కావాల్సింది శపథాలు కాదు!

28-12-2025 12:00 AM

దేశంలో ఉత్తరాది రాజకీయాల కంటే దక్షిణాది రాజకీయాలు భి న్నమైనవి. దక్షిణాది రాష్ట్రాలలోని ప్రజల కు రాజకీయ చైతన్యం ఎక్కువ. ఆయా రా ష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీల నాయకులు రాజకీయాలను శాసిస్తున్నారు. రెం డు తెలుగు రాష్ట్రాల్లో కూడా బలమైన ప్రాంతీయ పార్టీలు రాజకీయాలపై తమదైన ముద్ర వేస్తున్నాయి. కేరళలో రెండు కూటముల మధ్య, తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీల మధ్య, ఏపీలో రెండు ప్రాం తీయ పార్టీల మధ్య, కర్ణాటకలో రెండు జా తీయ పార్టీల మధ్య అధికారం కోసం రాజకీయ పోరాటం జరుగుతున్నది.

అయితే అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం అధికార కాంగ్రెస్ జాతీయ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీకి మధ్య రాజకీయ పోరాటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 2023 శాసనసభ ఎన్నికల్లో అనూహ్య ఓ టమి తర్వాత రాజకీయంగా స్తబ్దుగా ఉన్న బీఆర్‌ఎస్, మౌనంగా ఉన్న ఆ పార్టీ అధినేత కేసీఆర్.. ఇటీవలే కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న త ర్వాత మౌనాన్ని వీడారు. మళ్లీ రాజకీయం గా క్రియాశీలకంగా మారుతూ ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టడం, ఆ విమర్శలకు ప్రతిగా ముఖ్యమంత్రి ఘటైన సమాధానాలు ఇవ్వడంతో రాష్ర్టంలో రాజకీయా లు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఉద్యమ కాలం కేసీఆర్ ఎక్కడ! 

శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత జారిపడిన కేసీఆర్ ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో కూడా దారుణమైన ఓటమి పలకరించింది. దీంతో శాసనసభ సమా వేశాలను కూడా హాజరుకాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు.

ఈ నేపథ్యంలో రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావడం, ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్‌ఎ స్‌కు ఊహించిన దాని కంటే ఫలితాలు సంతృప్తికరంగా రావడంతో కేసీఆర్‌లో జోష్ పెరిగినట్లయింది. వెంటనే రాష్ర్ట పా ర్టీ కార్యవర్గ సమావేశంతో పాటు లెజిస్లేటివ్ పార్టీ సంయుక్త సమావేశాన్ని నిర్వ హించారు. రెండేళ్ల పాలనా వైఫల్యాలపై తనదైన శైలిలో మునపటి చెమకులతో  రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ఉద్య మ కాలం నాటి కేసీఆర్ కనపించకపోయినప్పటికీ తన సహజ శైలి విమర్శలతో ఒ కింత నవ్వులు పూయించే ప్రయత్నం చేశా రు.

ఈ రెండు సంవత్సరాల్లో కేసీఆర్‌ను దూషించటం, చావాలని కోరుకోవడం త ప్ప ఈ ప్రభుత్వం సాధించింది ఏమిటని ప్రశ్నిస్తూనే.. సెంటిమెంటుని రంగరించే ప్రయత్నం చేశారు. నదీ జలాల పంపిణీ, అక్రమ ప్రాజెక్టుల అంశాన్ని ప్రధానంగా తెరపైకి తెస్తూ పాలమూరు- ప్రాజెక్టు కేంద్రంగా మహబూబ్‌నగర్ జిల్లా వెనుకబాటును ప్రస్తావనకు తెచ్చారు. ఒకరకంగా జలాల అంశాన్ని ప్రజల్లోకి తీసుకె ళ్తూనే మరోవైపు సీఎం రేవంత్‌ను ఇరకాటంలో పెట్టే ఎత్తుగడగానే భావించొచ్చు. రైతుల యూరియా కష్టాలు, రియల్ ఎస్టే ట్ మందగమనం, పెట్టుబడి ఒప్పందాలను ప్రస్తావిస్తూ వ్యూహాత్మకంగా రంగా రెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సభలు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చ రికలు పంపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా? 

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టగానే.. నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే ఆయన విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. నదీ జలాల సమస్యకు కేసిఆర్ వ్యవహరించిన తీరే కారణ మని చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ విమర్శలపై రాష్ర్టవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలోనే రంగంలోకి దిగిన సీఎం రేవంత్ కొడంగల్ వేదికగా కేసీఆర్, కేటీఆర్‌లపైన విరుచుకుపడ్డారు. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కాలకూట విషం లాంటి కేసీఆర్‌ను అధికారంలోకి రానివ్వనని శపథం చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి లేదా నాయకుని అభి ప్రాయాలు, ఆకాంక్షలు ప్రజాభిప్రాయంగా మారిపోవనే విషయాన్ని నాయకులు గమనించాలి.

2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా, జరగకపోయినా మేము 80 నుంచి 100 శాసనసభ స్థానాలలో విజ యం సాధించి పదేళ్లు మేమే అధికారంలో ఉంటామని ముఖ్యమంత్రి నమ్మకంగా చెప్తున్నారు. కానీ 2023 శాసనసభ ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ 105 శాసనసభ స్థానాలలో బీఆర్‌ఎస్ విజ యం సాధిస్తుందని జోస్యం చెప్పినప్పటికీ ప్రజా తీర్పు అందుకు భిన్నంగా వచ్చింది. సీఎం రేవంత్ అతి విశ్వాసంతోనో, ఆత్మవిశ్వాసంతోనో మాట్లాడినా ప్రజలు మెచ్చే పరిపా లన చేస్తే రెండు పర్యాయాలు ఏమిటీ.. సిక్కింలో పవన్ కుమార్‌కు, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్‌కు ఐదు సార్లు వరుసగా అవకాశం ఇచ్చిన విధంగానే మీకు కూడా అవకాశం ఇస్తారు!  గెలుపోటములను నిర్ణయించేది ప్రజలే. అంతే కానీ ఆ నిర్ణయం నాయకులది కాదు.. వారి శపథాలు ఎంతమాత్రం కావు.

బలమైన ప్రతిపక్షం కావాలి! 

ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపైన, ప్రజల పక్షాన ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే బలమైన ప్రతిపక్షాలు ఉన్నప్పుడే ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటాయి. అందుకు తగ్గ విధానాలను రూ పొందిస్తాయి. రాజకీయ క్రియాశీలత కలిగిన మన రాష్ర్టంలో ఈ పదకొండున్నర సంవత్సరాల్లో ప్రతిపక్షాలు బలమైన పాత్ర పోషించకపోవడం బాధాకరం. 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ, 2023 నుంచి బీఆర్‌ఎస్.. ప్రతిపక్ష హో దాలో రాజకీయ విమర్శలకు, ప్రతి విమర్శలకే పరిమితమవుతున్నాయి. కానీ ప్రజ ల సమస్యల పైన బలమైన పోరాటాలు చేసిన దాఖలాలు కనపడడం లేదు.

ఉమ్మ డి ఏపీలో నాటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన విద్యుత్ ఉద్యమ తరహాలో ఒక్క ఉద్యమం కూడా కనిపించడం లేదు. అప్పుడు, ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే హామీల అమలు కోసం క్షేత్రస్థాయిలో కానీ, అసెంబ్లీ వేదికగా కానీ ప్రభుత్వాలను గట్టిగా నిలదీసి పోరాడిన ప్రతిపక్షాలు లేవనేది ప్రజల భావన. నాడు ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి రాకపోయినా పెద్దగా నష్టం లేదు కానీ నేడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకుండా అధికార పక్షాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించకుండా ఉంటే ఎలా అన్న ప్రశ్నకు విపక్ష నే త సమాధానం చెప్పాల్సిన అవసరముంది.

శ్రుతిమించిన విమర్శలు..

ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారపక్షం, ప్రజల తరపున పోరాడాల్సిన ప్రతి పక్షం బాధ్యతారహితంగా వ్యవహరించకుండా ఒకరిపై మరొకరు శృతిమించిన విమర్శలు చేసుకుంటూ రాజకీయ గౌరవాన్ని తగ్గిస్తున్నారనే భావన పెరుగు తోంది. ‘తోలు తీస్తా, బుడ్డేర్‌ఖాన్, ఓటుకి నోటు కేసు దొంగ, మూడు ఫీట్ల వాడు, దద్దమ్మలు, సన్నాసులు, రండలు’ లాంటి విమర్శలతో పాటు ‘పేడ మూతి బోడి లింగం, అమెరికాలో బాత్రూములు కడిగేటోడు, గాలిగాడు, ఆవులా పోరడు, లాగు లో తొండలు విడిచిపెడతా’ లాంటి తిట్ల దండకాలు రాజకీయ గౌరవానికి భంగం కలిగిస్తాయి. బాధ్యతాయుతమైన పదవు ల్లో.. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు తమపై వచ్చిన విమర్శలకు సంయమనం తో, హుందాగా, జవాబుదారీతనంతో స మాధానాలు చెప్పినప్పుడు వారి గౌరవమే పెరుగుతుంది. కానీ రాష్ర్టంలో పాలక ప్రతిపక్ష నాయకులు లక్ష్మణ రేఖలు దాటి తిట్టుకుంటూ ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారు. కానీ ఒక విష సంస్కృతిని విత్తు తున్నారనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రజల సంక్షేమం, రాష్ర్ట అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలి. కానీ అధికారం కోసం, పదవుల కోసం చేసే రాజకీయాలను చేయడం తప్పు అన్నది గ్రహించాలి.

వ్యాసకర్త సెల్: 9885465877

డాక్టర్ తిరునహరి శేషు