ఘనంగా వీర హనుమాన్ విజయ శోభాయాత్ర
01-04-2026 12:00 AM
భీమదేవరపల్లి, మార్చి 31 (విజయక్రాంతి): హనుమాన్ జయంతి సందర్భంగా టీటీడీఎస్ (త్రికూటేశ్వర ఆలయ టెంపుల్ డెవలప్మెంట్ సొసైటీ, ముత్తారం) వారి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం వీర హనుమాన్ విజయ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్ర కొత్తపల్లి శ్రీ దత్త సాయి క్షేత్రం నుండి ప్రారంభమై ముల్కనూర్ బస్టాండ్ మీదుగా ముత్తారం త్రికూటేశ్వర ఆలయం వరకు అంగరంగ వైభవంగా సాగింది.
హనుమంతుడి భారీ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉంచి ఊరేగించారు. శోభాయాత్రలో యువత కాషాయ జెండాలు పట్టుకుని జై శ్రీరామ్, జై జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీఎస్ సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




