ఓబీసీ 11వ జాతీయ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
సూర్యాపేట, జూలై 30 (విజయక్రాంతి): బీసీలంతా ఏకమై మేమెంతో మాకు అంతానే డిమాండ్ తో ముందుకెళ్లాలని ఐక్యతతో పోరాటాలు చేసి మనకు రావాల్సిన వాటాను మన హక్కులను మన సంక్షేమాన్ని సాధించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల్ల నర్సింహ అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద ఓబీసీ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు ఏడో తారీఖున బెంగళూరు పట్టణంలో జరిగే ఓ బి సి 11వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంల ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు ఏడో తారీఖున బెంగళూరు పట్టణంలో జాతీయస్థాయిలో ఓబిసి జాతీయ 11వ మహాసభ నిర్వహించడం జరుగుతుందని, దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి బీసీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. ఈ సభలో జనాభాలో 50% ఉన్న బీసీలకు చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్లు 50 శాతం కల్పించాలని, పార్లమెంటులో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు బిల్లు పెట్టాలని, కేంద్రం చట్టసభలలో మహిళలకు ఇచ్చే 33 శాతం రిజర్వేషన్ లలో బీసీ మహిళలకు కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని తదితర అంశాలను తీర్మానించి చర్చించడం జరుగుతుందన్నారు.
80 సంవత్సరాల స్వాతంత్రంలో బీసీల ఓట్లను వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఉక్కు పాదంతో అసివేస్తున్నారని, బీసీలను ఓట్లు వేసే యంత్రాల్లాగానే ఉపయోగించు కుంటున్నారన్నారు. బీసీలంతా పెద్ద ఎత్తున ఈ మహాసభకు తరలి వెళ్లి ఐక్యతను చాటి ప్రభుత్వాలు దిగివచ్చే విధంగా సభను విజయవంతం చేసుకోవాన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు బూర మన్సూర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణ గౌడ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు, తండ అంజయ్య గౌడ్,కందాల భాస్కర్, కోడి లింగ యాదవ్ , యేలే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






