22 June, 2026 | 1:33 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ జన్మదిన వేడుకలు..

27-11-2025 07:19 PM

ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్ లో కార్పొరేటర్ శాంతి సాయిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలు నాయకుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించారు. బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున నినాదాలతో  ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. కళాకారులతో నత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కేకులు కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు కార్యకర్తల నాయకుల ప్రజల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా నాచారం కార్పొరేటర్ శాంతి గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా నాచారం కు చెందిన శోభన్ అనే వికలాంగునికి లక్ష పదివేల రూపాయలతో మూడు చక్రాల జుపిటర్ వాహనాన్ని  ఎమ్మెల్యే చేతుల మీదిగా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి హెచ్ బి కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్ ఖాదర్ నాచారం రాఘవేంద్రనగర్ కాలనీ పాస్టర్ శాంసన్ తదితరులు పాల్గొన్నారు.