27-11-2025 07:20:29 PM
చిగురుమామిడి (విజయక్రాంతి): చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ సభలను గురువారం గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఆధారంగా పోటీలో ఆసక్తిగల అభ్యర్థులతో మాట్లాడి జాబితాన్ని స్వీకరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఇంటింటా తిరిగి ప్రజలకు వివరించాలని సూచించారు. బరిలో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తిరుపతి, భూమిరెడ్డి, సత్యనారాయణ, ఎస్కే సిరాజ్, రమేష్, సంపత్ రెడ్డి, వెంకటేశం, రాజయ్య, సదానందం, సంపత్, శ్రీనివాస్, ప్రమీల, సరవ్వ, వజ్రవ్వ, ఆంజనేయులు, ముత్యాలు, శ్రీనివాస్, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.