27-11-2025 07:16:42 PM
కుంటాల (విజయక్రాంతి): కుంటాల ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా అధికారులు సన్నద్ధం కావాలని కోరుతూ గురువారం రోజు వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని తాసిల్దార్ ఆడే కమల్ సింగ్ ఎంపీడీవో అల్లాడి వనజ నువ్వు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చూడాలని పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం తో పాటు మరుగుదొడ్ల నివారణ విద్యుత్తు పరికరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్టతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 30 నుండి నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో పలు సూచనలు ఇచ్చారు, అధికారులు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వివరించారు అదేవిధంగా నామినేషన్ల స్వీకరణపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.