calender_icon.png 8 December, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెస్సీ మ్యాచ్ కు ముస్తాబవుతన్న ఉప్పల్ స్టేడియం

08-12-2025 12:23:45 AM

-ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

-భద్రత ఏర్పాట్లపై పలు సూచనలు

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి) :  అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లైనోల్ మెస్సీ హైదరాబాద్ టూర్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌తో మెస్సీ ఆడే మ్యాచ్ ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం సన్నద్ధమవుతోంది.

దీనికి సంబంధించిన ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పరిశీలించారు. పోలీసు భద్రత, ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. తెలంగాణ రైజింగ్ కార్యక్ర మంలో భాగంగా మెస్సీ టూర్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ సారథ్యంలోని టీమ్‌తో మెస్సీ టీమ్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతుందని వెల్లడించారు.  అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ అయిన మెస్సీకి అత్యు న్నత స్థాయిలో సెక్యూరిటీ కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేం దుకు ప్రజలు, అభిమానులు సహకరించాలని కోరారు. మ్యాచ్‌ను వీక్షించే అభిమానులు నిర్ణీత సమయానికి కంటే ముందే స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.