calender_icon.png 10 December, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గబ్బాలోనూ ఇంగ్లాండ్ చిత్తు

08-12-2025 12:17:57 AM

- యాషెస్ సిరీస్‌లో ఆసీస్ జోరు

- రెండో టెస్టులోనూ ఘనవిజయం

బ్రిస్బేన్, డిసెంబర్ 7: సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా దుమ్మురే పుతోంది. వరుసగా రెండో టెస్టులోనూ ఇం గ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆసీస్ బౌలర్ల దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 241 పరుగులకే చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మిఛెల్ స్టార్క్ ఆ జట్టును దెబ్బతీస్తే.. రెండో ఇన్నింగ్స్ ఆసీస్ పేసర్ నెసర్ దెబ్బకొట్టాడు.

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ (50),విల్ జాక్స్ (41) పోరాడినా ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ క్రీజు లో నిలవలేకపోయారు. డకెట్ (15), పోప్ (26), రూట్(15), బ్రూక్(15) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో నెసెర్(5/42) ఐదు వికెట్లు, స్టార్క్ 2 , బొలాండ్ 2, డగ్గెట్ 1 వికెట్ తీశారు. తర్వాత 65 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. స్టీవ్ స్మిత్ (9 బంతుల్లో 23) పరుగులతో జట్టు విజయాన్ని పూర్తి చేశాడు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో మిఛెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ 334 పరుగులు చేసింది. ఇంకా తక్కువ స్కోరుకే ఆలౌట్ అవుతుందనుకున్నప్పటకీ రూట్ సెంచరీతో మంచి స్కోరే అందించాడు. అటు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకున్నా లబూషేన్, అలెక్స్ క్యారీ, స్మిత్, వెదర్లాండ్, స్టార్క్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో 511 పరుగుల భారీస్కోర్ చేసింది. 

కాగా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, హాఫ్ సెంచరీ స్కోర్ చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన మిఛెల్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.సిరీస్‌లో మూడో టెస్ట్ డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా జరుగుతుంది.