13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సమిష్టి కృషితో పట్టణ అభివృద్ధి

01-04-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

మహబూబాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు సిబ్బంది సమిష్టి కృషితో పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబాబాద్‌ పట్టణంలోని మునిసిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన మహబూబాబాద్ మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ మునిసిపల్ చట్టం 2019 పై ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్లు, అధికారులు అవగాహన ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధికి బడ్జెట్ ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందించి అమలుచేయాలని సూచించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.

సమావేశంలో మొదటిసారిగా పాల్గొన్న కౌన్సిల్ సభ్యులను అభినందించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంను మున్సిపాలిటీలలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, అందుకు మున్సిపల్ సిబ్బంది కృషి చేయడంతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా వార్డుల్లో పర్యటిస్తూ చెత్త తొలగింపు, డ్రైనేజీలను శుభ్రపరచడం, రోడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

మునిసిపాలిటీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.92 కోట్ల 68 లక్షల 69 వేల ఆదాయం, రూ.92 కోట్ల 66 లక్షల 70 వేల వ్యయంతో బడ్జెట్ ను ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, చైర్పర్సన్ జ్యోతి రమేష్, వైస్ చైర్పర్సన్ సూర్ణపు సోమయ్య, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. కాగా సమావేశంలో పట్టణ సమస్యల పై బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతుండగా అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డుపడడంతో కొంతసేపు కౌన్సిల్ సమావేశంలో రభస చోటు చేసుకుంది.