మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్‌లో సిద్ధార్థ విద్యార్థులకు పతకాలు
01-04-2026 12:00 AM
ముకరంపుర, మార్చి 31 (విజయక్రాంతి): రాష్ట్ర స్థాయి మ్యాథమెటిక్స్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ లో మంకమ్మతోటలోని సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. పాఠశాల చెందిన విద్యార్థులు ఎస్ ధనుష్ 3వ స్థానంలో, వి ఆప్తి 4వ స్థానంలో, జి సాత్విక 5వ స్థానంలో ఉత్తీర్ణత సాధించి బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని గెలుపొందారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అభినందించారు.




