15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రానికే ఆదర్శం

16-05-2025 12:42 AM

అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్, మే 15 (విజయ క్రాంతి) : నిజామాబాద్ నగరంలోని సిర్నాపల్లి గడిలో గల గాండ్ల సంఘం రెండవ అంతస్తు భవనాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇందూరు పట్టణంలోని గాండ్ల యువజన సంఘం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని ఇదేవిధంగా ఐక్యమత్యంతో అంచలంచలుగా ఎదుగుతూ కళ్యాణ మండపం అభివృద్ధి పరచడం అభినందనీయమని సూర్యనారాయణ అన్నారు గాండ్ల పట్టణ సంఘం రెండవ అంతస్తు ఎస్ డి ఎఫ్ నిధుల కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని రాబోయే రోజుల్లో కూడా సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ వారికి హామీ ఇచ్చారు.

తాను ఎమ్మెల్యేగా గెలిచి రండి సంవత్సరాలు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే నిధులు కూడా మంజూరు చేయలేదని ఈ సందర్భంగా సూర్యనారాయణ ఆరోపించారు నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్క చెబుతున్నప్పటికీ వివక్ష చూపిస్తుందని ఆయన ఆరోపించారు.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ అర్బన్ నియోజకవర్గం పై ప్రత్యేక చొరవ తీసుకొని స్పెషల్ ఫండ్స్ మంజూరి చేయించాలని ఈ సందర్భంగా మహేష్ కుమార్ కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ గాండ్ల సంఘం అధ్యక్షులు పురపాలక శాఖ అశోక్. నాగరాజు నుడా చైర్మన్ కేశ వేణు నరాల సుధాకర్ తదితరులు హాజరయ్యారు.