calender_icon.png 16 May, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు

16-05-2025 12:43:03 AM

జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

 సిరిసిల్ల, మే 15 (విజయక్రాంతి): శుక్రవారం రోజున రుద్రంగి మండలంలో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ .

ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ...రుద్రంగి మండలంలో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పోలీస్ అధికారులు,సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సభ ప్రాంగణంలో, విఐపి/జనరల్ గ్యాలరిలో, రూట్ బందోబస్తు,విఐపి పార్కింగ్/జనరల్ పార్కింగ్ ప్రదేశలలో బందోబస్తులో ఉన్న అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు.

ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,అదనపు ఎస్పీ చంద్రయ్య,సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ, డిసిర్బీ డిఎస్పీ శ్రీనివాస్,సి.ఐ లు మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, మధుకర్, నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఆర్.ఐలు రమేష్, మధుకర్ లు పాల్గొన్నారు.