calender_icon.png 20 August, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార సంఘంలో రైతులకు అందుబాటులో యూరియా

20-08-2025 12:18:16 AM

  1. మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో మంథనిలో రైతులకు యూరియా కొరత లేదు 

మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని ఆగస్టు 19 (విజయక్రాంతి) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని లో 900 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పిఎసిఎస్ మంథని లో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మా ట్లాడుతూ యూరియా బస్తాల కోసం వచ్చే రైతులు తమ వెంట పట్టా దారు పాసు పుస్తకం, ఆదార్ జీరాక్స్ ప్రతులు తమ వెంట తీసుకు రావాలని కోరారు.

రాష్ట్ర ఐటి, పరిశ్రమ లు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యెక చొరువతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉం చుతున్నామని, రైతులు ఏ మాత్రం అధైర్య పడవద్దని, రైతులకు యూరియా కొరత లేకుండా తగు చర్యలు తీసు కుంటున్నారని అన్నారు. అలాగే వ్యవసాయ శాఖ ఏడిఏ, ఏఓ, ఏఈఓ ల సహకారంతో యూరియా కొరత లేకుండా తగు చ ర్యలు చేపడుతున్నారని,రైతులు తమ అవసరాల మేరకే యూరియా తీసుకొని వాడుకోవాలని కోరారు.