20-08-2025 12:17:42 AM
నేరేడుచర్ల: నేరేడుచర్ల మండల ఫోటో, వీడియోగ్రాఫర్ల యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను మంగళవారం నేరేడుచర్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్‌ఐ రవీందర్ నాయక్ హాజరై, మొదటిసారి ఫోటోగ్రఫీ కనిపెట్టిన లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతి కార్యక్రమంలో ఎంతో కష్టపడి ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తారన్నారు.
ప్రపంచంలో ఫోటో కి ఉన్నంత ఆదరణ దానిని తీసిన వ్యక్తికి ఒక్కోసారి లభించదన్నారు.ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో తీసిన వ్యక్తిని,దానిని వృత్తిగా ఎంచుకున్న వారిని గౌరవించి అభినందించాలన్నారు.ఫోటోగ్రాఫర్ లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ల జిల్లా సలహాదారు శ్రీనివాస చారి, మండల అధ్యక్షుడు మచ్చ రవి, గౌరవ అధ్యక్షుడు చందమల్ల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి శివకోటి, నరసింహ చారి, కార్యదర్శి నీలా సందీప్, ఉపాధ్యక్షులు బెంజిమెన్, సందీప్ వర్మ, మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సైదులు, బాలస్వామి, ఫోటోగ్రాఫర్లు గణేష్, ఆర్కే, రాపోలు సురేషు, గౌసు, మనోహర్, రవి, మధు, కిషోర్, నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు.