26-08-2025 03:02:14 PM
రైతుల కోసం వర్షాన్ని సైతం లెక్కచేయని మాజీ ఎమ్మెల్యే
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్య నాయక్.
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందు మంగళవారం టిఆర్ఎస్ పార్టీ మహబూబాద్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ రైతుకు యురియా తక్షణమే అందించాలని, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా రైతులకు యురియా కష్టాలు రాకుండా చూసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ అని ప్రతి పేద రైతుకు రైతు భరోసా, రైతు భీమా ,అనేక కార్యక్రమాలు రైతుల కోసం గత గడిచిన 10 సంవత్సరాలలో చేయడం జరిగిందన్నారు.
ఏ ఒక్క చిన్న సన్నకారు రైతులు కూడా రోడ్డు ఎక్కకుండా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఏరియా సరఫరా చేశామన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి గడిచిన రెండు నెలల కాలంలో ఎన్నడు లేని విధంగా రైతులు యురియా బస్తాల కోసము పడిగాపులు కాస్తున్న తీరు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఎంత ప్రేమను చూపిస్తుందో అర్థమవుతుందని, ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకే న్యాయం చేయని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, డోర్నకల్ యువ నేత రవిచంద్ర, మాజీ ఎంపీపీ అరుణ రాంబాబు, మాజీ జెడ్పిటిసి శారద రవీందర్, మాజీ ఉడిసిఎంఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకన్న, మరిపెడ మండలం మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు అజ్మీర రెడ్య నాయక్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ,మాజీ వార్డ్ మెంబర్లు, బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.