calender_icon.png 26 August, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

200 శాతం సుంకాలు విధించేందుకు వెనుకాడబోం

26-08-2025 11:58:06 AM

వాషింగ్టన్: వాణిజ్య విభేదాల్లో చైనాతో పోలిస్తే తమ అధిపత్యమే ఎక్కువని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పోటీకి వస్తే బీజింగ్ కు వినాశనం తప్పదని ట్రంప్ పరోక్ష హెచ్చరికాలు పంపారు. 200 శాతం సుంకాలు విధించేందుకూ తాము సిద్దంగా ఉన్నమని ట్రంప్ ప్రకటించారు. చైనాతో గొప్ప సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరిలో లేదా ఆ తర్వాత చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరుదేశాల మధ్య అద్భుత సంబంధాలు ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉందని, వాళ్ల వద్ద కొన్ని కార్డులుంటే తమ వద్ద అంతకంటే అద్భుత కార్డులు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. కొన్ని అరుదైన ఖనిజాల సరఫరాను నిలిపివేస్తే చైనాపై 200 శాతం సుంకాల విధింపు ఉంటుందని.. 200 శాతం సుంకాలు విధించేందుకు వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరించారు.