చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
14-05-2026 02:21 AM
వాణిజ్య ఒప్పందంపై జిన్‌పింగ్‌తో చర్చలు
హైదరాబాద్, మే 13: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ బుధవారం చైనాలోని బీజింగ్‌కు చేరుకున్నారు. మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. చివరిసారిగా ఆయన 2017లో అధ్యక్ష హోదాలో చైనాను సందర్శించిన ట్రంప్ తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
ఇరాన్ యుద్ధం, చైనాతో వాణిజ్యం, తైవాన్‌కు అమెరికా ఆయుధాల విక్రయం, ఏఐ వంటి విషయాలపై చైనా షి జిన్ పింగ్‌తో చర్చించనున్నారు. ట్రంప్‌తో పాటు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, యాపిల్ సీఈవో టిముక్, ఎన్‌ఏడియాకు చెందిన జెన్సన్ హువాంగ్ కూడా చైనాకు వెళ్లినట్లు తెలుస్తోంది. చైనాతో అమెరికా టెక్‌కు సంబంధించి పెద్ద ఒప్పందం చేసుకుంటారని తెలుస్తున్నది.






