14 May, 2026 | 3:27 AM

నేడు శ్రీనివాసరావు ప్రమాణస్వీకారం

14-05-2026 02:23 AM

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా బాధ్యతలు

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: రాఘవశర్మ

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన బసవరాజు శ్రీనివాసరావు గురువారం ఉదయం 9.30 గంటలకు నాగోల్‌లోని వసంత విహార్ ఫంక్షన్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చే యాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ (బి ఓ ఎస్ ఎస్) అండ్ భారత్ సేవా సహకార ఫోరమ్ (బిఎస్‌ఎస్‌ఎఫ్) సభ్యులు రాయపోలు రాఘవశర్మ కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ బంధువు లంతా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి స్నేహశీలి, సౌమ్యుడు, నిరాదంబరుడు అయిన బసవరాజు శ్రీనివాసు గారిని ఆశీర్వదించాల్సిం దిగా కోరారు.