10-02-2025 01:24:47 AM
* జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొ న్నారు. ఆదివారం ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహాన్ని, వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంను, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శిం చి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషెంట్ల కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా క్షేత్ర స్థాయి లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నా రు. ల్యాబ్, వార్డు, తదితర వాటిని పరిశీలిం చి అందుబాటులో ఉన్న పరికరాలను ఉప యోగించుకుని వైద్య సేవలు అందించాల న్నారు. గ్రామంలో షెడ్యూల్డ్ కులాల అభి వృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీ లించారు.
వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? వారికి ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు? అన్ని మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. వసతి గృహంలోని స్టోర్ రూమ్, వంటగది డార్మెట్రీలను కలెక్టర్ పరిశీలించారు.
విద్యార్థులు ఆడుకోవడానికి క్రికెట్ కిట్ సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన ఆహారం అందిం చాలని సూచించారు. గ్రామంలోని ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న గోదాంను తనిఖీ చేశా రు. అందుబాటులో ఉన్న ఎరువుల గురించి ఆరా తీశారు. ఇప్పటివరకు ఎంత మంది రైతులకు ఎంత ఎరువులు విక్రయించారు, వాటి ధరలు ఎంత అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ లను పరిశీలించారు.
ఎరువుల లభ్యత గురించి రైతులు ఆందోళన చెందవద్దని, అందుబాటు లో ఎరువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల లభ్యత, ధరలకు సంబంధించిన పట్టికను గోదాం బయట ఏర్పాటు చేయాల ని ప్యాక్స్ కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించా రు.
నిర్మాణ దశలో ఉన్న తరగతి గదులు పూర్తి చేయడంలేదనే విషయాన్ని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, నిర్మాణం పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామ న్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్క రించాలని తహశీల్దార్, ఎంపీడీఓ లను కలెక్ట ర్ ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి డా. రజి త, పిఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, మెడికల్ ఆఫీసర్ డా.గీతాంజలి, వార్డెన్ శంకర్ లు ఉన్నారు.