10-02-2025 01:25:26 AM
మహబూబ్‌నగర్. ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) : యావత్తు దేశ ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని మహబూబ్ నగర్ ఎంపీ డీజే అరుణ అన్నారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని కాం గ్రెస్ పార్టీ ధర్నాలు చేయడం జరిగిందని, గాడిద ఎప్పుడు ఎక్కడ గుడ్డు పెట్టదని, ఢిల్లీ ఓటర్లు కూడా కాంగ్రెస్‌కు ఒక సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
మహారాష్ర్ట, హర్యానా ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా గుణపాఠం చెప్పారని, ప్రజలను మోసం చేసే తీరును అందరూ అవగతం చేసుకున్నారన్నారు. రాష్ర్ట ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల ముందు, జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ముందు అంటూ కాలయాపన చేస్తుందని ఆరోపించారు.
ఏ ఎన్నికలు ముందు వచ్చిచా బీజేపీ విజయం సాధించడం ఖాయమని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. కేవలం టీవీలలో పేపర్లలో వచ్చేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ప్రజలకు మంచి చేయాలన్న తపన వారికి లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
అన్ని రంగాలకు సముచిత స్థానం కల్పిస్తూ తమ పార్టీ ముందుకు సాగుతుందని, పేదలను ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శ్రీనివాస్ రెడ్డి, పద్మజారెడ్డి, పగుడాకుల బాలరాజ్ తదితరులు ఉన్నారు.