11-08-2025 01:17:38 AM
చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఈడీ
బీబీటీపీఎల్ ద్వారా ఐదు కోట్లు, ఎస్‌ఎల్‌హెచ్‌పీఎల్ కంపెనీ ద్వారా 53 కోట్ల నిధుల మళ్లింపు
న్యూఢిల్లీ, ఆగస్టు 10: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్‌వాద్రాపై ఈడీ మరో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ వద్ద ఓ వివాదాస్పద భూ ఒప్పందం ద్వారా వాద్రాకు రూ. 58 కోట్ల మేర లబ్ధి చేకూరినట్టు ఈడీ ఆరోపణలు చేసింది. బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీబీటీపీఎల్) ద్వారా రూ. 5 కోట్లు, స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎల్‌హెచ్‌పీఎల్) ద్వారా రూ. 53 కోట్లు మళ్లించారని ఈడీ అభియోగాలు మోపింది.
ఈడీ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసి రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేసింది. ఈడీ చార్జ్‌షీట్ ప్రకారం వాద్రా కంపెనీ 2008లో గురుగ్రామ్‌లోని షికోహ్‌పూర్‌లో ఓంకారేశ్వర్ ప్రాప ర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వాద్రాకు చెం దిన స్కైలైట్ హాస్పిటాలిటీ 3.5 ఎకరాల భూ మి కొనుగో లు చేసింది. ఆ తర్వాత ఈ భూ మిని రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కి రూ.58 కోట్లకు విక్రయించింది.
అయితే ఈ భూమి విలువ ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ హౌ సింగ్ స్కీమ్ లైసెన్స్ ఇప్పించేందుకు అప్పటి హర్యా నా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా సాయం చేశారని ఈడీ ఆరోపణలు గుప్పించింది. ఈ కుంభకో ణం ద్వారా సమకూరిన రూ.58 కోట్లను రెండు కంపెనీల ద్వారా మ ళ్లించారంది. ఈ డబ్బుతో వాద్రా అ సేక స్థిరాస్తులు కొనుగోలు చేయడమే కా క, కొన్ని చోట్ల పెట్టుబడులు కూడా పెట్టారని చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది.
ఈ కేసు దర్యాప్తులో భా గంగా రూ. 38.69 కోట్ల విలువైన 43 స్థిరాస్తులను ఇప్పటికే అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. రాజస్థాన్‌లోని బికనీర్, గురుగ్రామ్, మొహాలీ, అహ్మదాబాద్, ఫరీదాబాద్, నోయిడాలలో ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసులో నిందితులకు శిక్ష వేయడమే కాకుండా ఆస్తు లు కూడా జప్తు చేయాలని ఈడీ కోర్టుని అ భ్యర్థించింది.
ఈ కేసు 2018 సెప్టెంబర్ నుం చి పెండింగ్‌లో ఉంది. ఈ కేసుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. వా ద్రాపై కేంద్రప్రభుత్వం గత దశాబ్దకాలంగా పగబట్టి వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజకీయంగా ప్రేరేపించబడిన కేసులతో ఈ డీ రాబర్ట్ వాద్రాను టార్గెట్ చేసిందన్నారు