11-08-2025 01:20:29 AM
ములుగు, ఆగస్టు 10 (విజయక్రాంతి)/కన్నాయిగూడెం: ప్రజాప్రభుత్వం దేవాదుల ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క లతో కలిసి ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కన్నాయిగూడెం మండలంలోని జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌ను పరిశీలించి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్ట్ పరిధిలోని 17 అసెంబ్లీ నియో జకవర్గాల్లో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఆయక ట్టుకు త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్ర భుత్వం ఉందని పేర్కొన్నారు. రూ.67 కోట్ల తో భూసేకరణ చేపట్టనున్నామని తెలిపారు. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి, పెం డింగ్ బిల్లులు కలిపి మొత్తం రూ. వంద కో ట్ల ఉన్నాయని, విడతాలవారీగా నిధులు వి డుదల చేస్తామని చెప్పారు.
ఏడాదిలో రెం డు సీజన్లకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని.. అందుకు తగినట్టు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు ను మొదలు పెట్టినప్పుడు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మాణం చేప ట్టినా మరింత పెరిగి ప్రస్తుతం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని, సాగు నీటి ఆయకట్టు ఇంకా పెరిగే అవకాశం ఉం దని అంచనా వేశారు.
ఈ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి అ త్యంత ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పెరిగిన ఆయకట్టు కు కూడా నీరు అందించేలా ప్రణాళికలు చే యాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇక్కడ 38 టీఎంసీల స్సామర్థ్యం ఉండగా, ఇప్పుడు 78 నుంచి 80 టీఎంసీల అవసరం అవుతుందని, దాని గురించి కూడా ఇరిగేషన్ మంత్రి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు.
సాగునీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్ట్ అన్ని దశలను పూర్తి చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ సాగునీటి పారుదల శాఖ మంత్రితో మాట్లాడుతున్నామని, ఆ రాష్ట్ర పరిధిలోని ముంపు ప్రాంతా లకు పరిహారం చెల్లించే విషయమై చర్చలు జరిగినట్టు చెప్పారు.
దేవాదుల ప్రాజెక్ట్ పరిధిలో ఇంకా భూసేకరణ పూర్తికాని చోట్లా ఆ యా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని సాగునీటి పారుదల శాఖ సీఈ వెంకటేశ్వర్లును ఆదేశించారు. ‘కాళేశ్వరం కమిషన్ నివేదిక చూసి నిర్ఘాంత పోయాం. గత పాలకుల అవినీతి, అసమర్థత వల్లే కూలిపోయిందని కమిషన్ చెప్పింది.
కాళేశ్వరం డిజైన్ చేసింది వారే.. కూలిపోయింది వారి హయాంలోనే. కాళేశ్వరం నివేదికపై ఎలాంటి రాజకీయాలు లేవు. నీటిని మూడు బ్యారేజీల్లో నిల్వ ఉంచొద్దని ఎన్‌డీఎస్‌ఏ స్పష్టంగా చేప్పింది. తుమ్మి డిహట్టి వద్ద ప్రాజెక్ట్‌ను కట్టి తీరుతాం’ అని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్ట్‌పై ఇక్కడ సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి అని పేర్కొన్నారు. పక్కనే గోదావరి ఉన్నా కన్నాయిగూడెం ప్రాంతంలో సా గునీరు అందడం లేదని వాపోయారు. దేవాదుల ద్వారా రామప్ప చెరువు నిండితే ము లుగులోని పలు ప్రాంతాలు ముంపునకు గు రవుతాయన్నారు. దేవాదుల బ్యారేజ్ నిర్మా ణం కోసం భూమిని కోల్పోయిన రైతులకు మానవీయ కోణంలో ఆలోచించి తగిన నష్టపరిహారం అందించాలన్నారు.
మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరు నాగారంలో కెనాల్స్‌పై ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు సరిగా పనిచే యక తాగునీరు అందడం లేదన్నారు. పాకా ల ద్వారా నర్సంపేటకు నీరందిస్తూ కొత్తగూడెనికి కూడా సాగునీరు అందించేలా ప్రణా ళికలు రచించాలని కోరారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నా రు.
దేవాదుల పంప్ హౌజ్ వద్ద మల్లంపల్లి మండల కొడిశల కుంటలో రూ. 2.7 కోట్ల తో చేపట్టిన 33/11 కేవీ విద్యుత్తు ఉప కేం ద్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మం త్రి సీతక్క ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. ములుగు మండలంలోని గట్ట మ్మ, బండారుపల్లి, జగ్గన్నపేట, లింగాల, నా ర్లపూర్, రొయ్యురు, బుచ్చంపేటలలో రూ. 20.73 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33 /11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు.