calender_icon.png 13 August, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి వైపు అడుగులు

11-08-2025 01:05:18 AM

  1. పట్టణ వాసి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు 

సమగ్ర అవగాహనతో అభివృద్ధి చేసేలా చర్యలు 

49 వార్డుల నుంచి 60 డివిజన్లుగా ఆవిర్భావం

గల్లి గల్లి లో సిసి రోడ్లు, అవసరమైన ప్రాంతాల్లో పార్కులు

ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని చక్క బెడుతున్న మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి 

మహబూబ్ నగర్ ఆగస్టు 10 (విజయ క్రాంతి) : ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ పట్ట ణంలో అభివృద్ధి ఆగమేఘాల మీద శరవేగంగా అడుగులు వేస్తుంది. ఇందుకు ద ప్ర త్యేక కారణాలు కూడా లేకపోలేదు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా 2012 సంవత్స రంలో జరిగిన ఉప ఎన్నికల్లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందిన విష యం విధితమే.

అంతకంటే ముందుగా కూ డా మహబూబ్ నగర్ పై పూర్తిస్థాయిలో ప ట్టు ఉన్న నాయకుడిగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి పూర్తిస్థాయిలో పట్టు ఉంది. ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి మహబూ బ్ నగర్ పట్టణంలో ఏనుగొండ ప్రాంతానికి చెందిన ఇప్పటి మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి బా ధ్యతలు చేపట్టినప్పటి నుంచి మరింత వేగం గా అభివృద్ధి వైపు పట్టణం అడుగులు వే స్తుంది. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుం డా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అవసరమైన ప్రాంతాల్లో సిసి రోడ్ల తో పాటు, ప్రత్యేక పార్కులను ఏర్పాటు చే స్తూ ప్రజల మండలాలు పొందుతున్నారు. 

- పట్టణవాసి కావడంతో అభివృద్ధి వేగవంతం

పట్టణవాసికి మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ గా విచ్చేయడంతో ప్రతి గల్లీ పై ప్రవీణ్ కుమార్ రెడ్డికి పట్టు ఉంది. దీంతో నూతనంగా ఆవిష్కృతమైన ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా పట్టు ఉండడంతో ఎక్కడ ఎలాంటి పనులు ముందుగా చేయాలనే ఆ లోచనలతో గల్లి గల్లి లో అభివృద్ధి ఆవిష్కృతమవుతుంది.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి ఎప్పటికప్పుడు సమాచారం అంది స్తూ ఎక్కడ ఏ వార్డులో ఎలాంటి పనులు చేయాలో పూర్తిస్థాయిలో సమాచారం అం దిస్తూ అభివృద్ధిని పరుగులు పట్టిస్తున్నారు. నిర్లక్ష్యమనే తాగు లేకుండా పట్టణంలోని వివిధ విద్యాలయాల్లో కూడా ముడా నిధులతో వాటర్ ఫిల్టర్ కేంద్రాలను ఏర్పాటు చే యడంతో పాటు, అనువైన ప్రదేశాలలో పా ర్కులను సైతం ఏర్పాటు చేస్తూ ఆయా ప్రాం తాల్లోని ప్రజల మన్ననలు పొందుతున్నారు.

- మున్సిపల్ టు కార్పొరేషన్....

అనతి కాలంలోనే మహబూబ్ నగర్ మున్సిపల్ నుంచి కార్పొరేషన్ చేరుకుంది. ఈ నేపథ్యంలో దివిటిపల్లి, జై నెల్లిపూర్ గ్రా మాలు సైతం మహబూబ్ నగర్ లో విలీనం అయిన విషయం విధితమే. 49 వార్డులుగా ఉన్న మున్సిపాలిటీ, 60 డివిజన్లుగా మా రుతూ అతిపెద్ద కార్పొరేషన్ గా మహబూబ్ నగర్ చేరుకుంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఆయా ప్రాంతాల వాసుల సైతం మ హబూబ్ నగర్ వైపు చూసేలా ఆకర్షితం అవుతుంది.

ఇప్పటికే ఐటి పార్క్ తో పాటు, అమర రాజా బ్యాటరీ కంపెనీ, అతిపెద్ద మయూరి పార్క్, ప్రముఖ విద్యాలయాలు, రాష్ట్రంలో పేరుపొందిన వ్యాపార సముదాయాలు సైతం మహబూబ్ నగర్ లో ఆవి ష్కృతమై ఉండడంతో పాలమూరు ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇందుకు అనుగుణంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఇతర ప్రాంతాల ప్రజలను సైతం ఇక్కడ వివిధ వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేలా ఆకర్షితం చేస్తున్నారు. 

- అదృష్టంగా భావిస్తున్నాను...

ఉద్యోగం నృత్యం ప్రభుత్వం ఎక్కడ విధులు చేయాలని సూచించిన అక్కడ సమర్థవంతంగా పనిచేశాను. నేను పుట్టిన,తిరిగిన,చదువుకున్న ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మహబూబ్ నగర్ ను చిన్నప్పటినుంచి చూస్తున్నాను.. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏమి చేస్తే బాగుంటుంది అని విషయాలపై సంపూర్ణ పరిజ్ఞానం ఉంది. ఎమ్మెల్యే సహకారంతో మహబూబ్ నగర్ ను అభివృద్ధివైపు తీసుకుపోతున్నాం. నిరంతరం అభివృద్ధి కోసమే శ్రమిస్తున్నాం. 

 ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్ నగర్