13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

తుజాల్‌పూర్ గ్రామానికి వైకుంఠ రథం అందజేత

27-03-2026 05:09 PM

బీబీపేట్,(విజయక్రాంతి): బిబిపెట్ మండలం తుజాల్‌పూర్ గ్రామ ప్రజలకు అంత్యక్రియల సమయంలో సౌకర్యం కల్పించేందుకు వైకుంఠ రథాన్ని గురువారం గ్రామానికి అందజేశారు. గ్రామానికి చెందిన దాతలు పెనుబెల్లి సుధాకర్ రెడ్డి, పెనుబెల్లి వెంకట్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముగ్గురు సోదరులు కలిసి తమ తండ్రి పెనుబెల్లి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ఈ రథాన్ని గ్రామానికి సమర్పించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు అంత్యక్రియల సమయంలో ఈ రథం ఎంతో ఉపయోగకరంగా ఉండి, అవసర సమయంలో సహాయపడుతుందని తెలిపారు.

గ్రామాభివృద్ధి కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు దాతలను అభినందిస్తూ, గ్రామానికి అవసరమైన సదుపాయాన్ని అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి దాతలు ముందుకు రావడం ఆనందకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలారి ప్రవిత-శ్రీనివాస్, ఉపసర్పంచ్ రంగయ్య లక్ష్మారెడ్డి, దాతలు పెనుబెల్లి సుధాకర్ రెడ్డి, పెనుబెల్లి వెంకట్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, మాజీ సర్పంచ్ చెల్లాపురం వెంకట్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.