22 May, 2026 | 8:53 PM

Breaking News

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •  

అంచనూర్‌లో ఘనంగా సీతారాముల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు

27-03-2026 05:04 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా సర్పంచ్ జనగామ నరేష్ ఆధ్వర్యంలో సీతారాముల విగ్రహాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. భక్తులు భజనలు, కీర్తనలు చేస్తూ గ్రామ వీధుల్లో ఊరేగింపుగా విగ్రహాలను తీసుకెళ్లారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు. తరువాత మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు విస్తృతంగా పాల్గొన్నారు.