06-05-2025 12:00:00 AM
కామారెడ్డి, మే 5 (విజయ క్రాంతి) : మాజీ ప్రధాని , భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు డా పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపతిరెడ్డి ,మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మాజీ ప్రధాని భారత నా అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మహనీయుని జీవిత చరిత్ర విషయంపై జిల్లా సదస్సు నిర్వహిచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 ఏప్రిల్ 1980 లో అటల్ బిహారీ వాజ్ పేయి , ఎల్ కె అద్వాని భారతీయ జనతా పార్టీని ప్రారంభించారు.
వాజ్ పేయి నా దేశమే నా కుటుంబం, నా దేశ అభివృద్ధి నా లక్ష్యంగా వారు ఈ దేశం కోసం బ్రహ్మచర్యం స్వీకరించారు. ఈ దేశం ఆర్థిక పరిస్థితులు భాగాలని రోజులో అటల్ బిహారీ వాజ్ పాయ్ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపరడానికి ఎంతో పని చేశారని ఆ సందర్భంగా తెలియజేశారుకామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంజిత్ మోహన్ , బాణాల లక్ష్మారెడ్డి అలాగే జిల్లా నాయకులు ,మండల అధ్యక్షులు పాల్గొన్నారు.