calender_icon.png 6 May, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎస్సీ ఫలితాల్లో డిస్నీల్యాండ్ విద్యార్థుల విజయ దుందుభి

06-05-2025 12:00:00 AM

నిజామాబాద్, మే 5 (విజయక్రాంతి) : ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో డిస్నీ ల్యాండ్ హైస్కూల్ విద్యార్థులు తమ సత్తా చాటారు. దామెర మండలం ఒగ్లాపూర్ లోని డిస్నీల్యాండ్ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో వరుసగా 20వ సారి కూడా తమ సత్తా చాటి విజయ దుందుభి మోగించారు. 

తుత్తురు హర్షిని, బానోత్  శ్రీమాన్   569 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. అలాగే 500 ఆ పై మార్కులు 47 మంది విద్యార్థులు సాధించారు.133 మంది విద్యార్థులకు గాను 130 మంది విద్యార్థులు ప్రధమ శ్రేణిలోనే ఉత్తీర్ణత సాధించడం ఎంతో గొప్ప విషయమని మారుమూల గ్రామాల్లో విద్యాసంస్థల స్థాపించి విద్యార్థులకు ఎన్నో పద్ధతిలో తరగతుల బోధన చేయడంతోటి సాధ్యపడిందని పాఠశాల నిర్వహించారు.

ఇంతటి అద్భుత విజయాలను సాధించిన విద్యార్థులను, బోధించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను పాఠశాల వ్యవస్థాపకులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మి నివాసం, డైరెక్టర్స్ శోభారాణి,రాకేష్ భాను, దినేష్ చందర్ లు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులు అభినందించారు.