ఎన్నికల్లో వంశీని గెలిపించాలి
03-05-2024 01:34 AM
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి ఓటు వేసి గెలిపించాలని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నేత దుద్దిళ్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఉపాధి కూలీల వేతనం పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల హామీని నెరవేరుస్తుందన్నారు.




