1 April, 2026 | 2:31 AM

మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

01-04-2026 01:03 AM

మంచిర్యాల మేయర్ మధుకర్ 

మంచిర్యాల, మార్చి 31 (విజయక్రాంతి): మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి, ఆర్‌టిసి మంచిర్యాల డిపో మేనేజర్, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధి అనితలతో కలిసి ఎ పి ఎం లు, డి పి ఎం లు, స్వయం సహాయక సంఘాల మహిళలతో మహాలక్ష్మి పథకం అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా 16 బస్సులు వస్తున్నాయని, ఆర్‌టిసి సంస్థకు లీజ్ కి ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం చేకూ రుతుందన్నారు. మహిళ సంఘాలకు ప్రభు త్వం ఆర్థిక చేయూతతో పాటు వివిధ వ్యాపార రంగాలలో అందిస్తున్న ప్రోత్సాహంతో వ్యాపార రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని, తద్వారా మరింత అభివృద్ధికి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.