calender_icon.png 7 November, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటెత్తిన బీహారీలు

07-11-2025 12:02:55 AM

-మొదటి దశ రికార్డు స్థాయిలో 64.66 శాతం పోలింగ్

-తొలి విడతలో 18 జిల్లాలు.. 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు

-బరిలో 1,314మంది.. ఆర్జేడీ సీఎం అభ్యర్థి, డిప్యూటీ సీఎంతో సహా పలువురు మంత్రులు  

-11న రెండో దశ పోలింగ్.. 14న ఓట్ల లెక్కింపు

పాట్నా, నవంబర్ 6: బీహార్ అసెంబ్లీ  తొలి విడత ఎన్నికల పోలింగ్ గురువారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకే ప్రారంభమై న పొలింగ్ తొలుత మందకొడిగా ప్రారంభమైంది. ఉదయం 9గంటల వరకు 13.13 శాతం నమోదు కాగా ఆ తర్వాత ఊపందుకుం ది. సాయంత్రం 5గంటల సమయం ముగిసే సరికి 64.66 రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

బీహార్‌లో 243 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా తొలి విడతలో 18 జిల్లాల్లోని 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్, అధికార పార్టీ డిప్యూ టీ సీఎం విజయ్‌కుమార్ సిన్హాతో సహా పలువురు మంత్రులు తొలి దశలోనే బరిలో నిలవ డంతో ఎన్నికకు ప్రాధాన్యత సంతరించుకుం ది. తొలి విడతలో మొత్తంగా 1,314 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. కాగా, రెండో దశ పోలింగ్ ఈ నెల 11న జరగనుండగా, 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

45,341 పోలింగ్ కేంద్రాలు.. కట్టుదిట్టమైన భద్రత

బీహార్ తొలిదశ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు 45, 341కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ సజావుగా జరిగేందుకు, ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంది. పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టింది. 

ఆర్జేడీ అధికారంలోకి వస్తే ఆటవిక రాజ్యమే

లఖిసరై నియోజకవర్గంలో తన కాన్వాయ్‌పై ఆర్జేడీ మద్దతుదారులే దాడికి పాల్పడ్డా రని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్‌కుమార్ సిన్హా ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్‌లో ఆటవిక రాజ్యం తప్పదనడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ‘నా కాన్వాయ్‌పై చెప్పులు, ఆవుపేడ, రాళ్లు రువ్వా రు’. ఖోరియారి గ్రామానికి సందర్శించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆర్జేడీ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడ్డారని సిన్హా ఆరో పించారు. దీనిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికార యంత్రాగం చర్యలు తీసుకోలేదని ఆయ న ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు స్థానికంగా డిప్యూటీ సీఎం మీడియాతో తెలిపారు. కాగా, మోసపూరిత ఓటింగ్‌ను నిరోధించేందుకు బుర్ఖా ధరించిన ఓటర్ల విషయంలో కఠినమైన తనిఖీ చేయాలని కేంద్రమంత్రి గిరిరాజ్ చేసిన వాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.   

ఓటేసిన ప్రముఖులు

-పోలింగ్ ప్రారంభమైన తొలిగంటలోనే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.  ఆర్జేడీ అధినే త లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి, ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్య ర్థి తేజస్వీ యాదవ్, ఆయన సతీమణిరాజశ్రీ యాదవ్, లాలూ కుమార్తెలు మీసా భారతీ, రోహిణి ఆచార్య పాట్నాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

- కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, బీహార్ డిప్యూ టీ సీఎం విజయ్‌కుమార్ సిన్హా లఖిసరైలో ఓటు వేశారు. మరో కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) పాట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

- కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ తన సతీమణితో కలసి హాజీపూర్ పోలింగ్ కేంద్రం లో ఓటు వేశారు.

-వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్, ఆర్జేడీ కూట మి డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సహానీ తన కుటుంబంతో కలిసి దర్భంగాలో ఓటు వేశారు. 

బీహార్ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా తొలిదశ పోలింగ్‌లో లఖిసరై నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకునేం దుకు వెళ్తున్న బీహార్ డిప్యూటీ సీఎం విజయ్‌కుమార్ సిన్హా కాన్వాయ్‌పై దుండగులు జరి పిన దాడిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆ రాష్ట్ర డీజీపీని ఆదే శించినట్లు ఈసీ అధికారులు తెలిపారు.