వరుణుడి కరుణ కోసం వరద పాశం
25-06-2024 05:21 AM
జయశంకర్ భూపాలపల్లి (ములుగు), జూన్ 24 (విజయక్రాంతి): వరుణదేవుడు కరుణించాలని, వర్షాలు సమృద్ధిగా కురువాలని కోరుతూ ములుగు మండలం కొత్తూరు ప్రజ లు దేవుని గుట్టపై సోమవారం వరద పాశం సమర్పించారు. ఏటా తొలకరి వర్షాలు కురిసే సమయం లో గ్రామస్థులు అడవి మార్గాన దేవుని గుట్ట ఆలయంపైకి వె ళ్లి బియ్యం, బెల్లం, పాలు, కుడకలతో పాశం తయారు చేసి లక్ష్మి నరసింహస్వామికి నైవే ద్యం సమర్పిస్తారు. ఆలయం ముందున్న పెద్ద రాయిపై పాశం పోసి స్వీకరిస్తారు. ఇలా చేయ డం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం.






