25-05-2025 01:02:54 AM
పోచంపల్లి, గద్వాల, గొల్లభామ చేనేత చీరలతో ర్యాంపుపై అందగత్తెల వాక్
వందకుపైగా దేశాల సుందరీమణులతో తెలంగాణ డిజైన్లకు ప్రపంచఖ్యాతి
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): మిస్ వరల్డ్ వేదికపై మరోసారి తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు తళుక్కున మెరిశాయి. శనివారం జరిగిన వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే షోలో పోటీదారులు అందరూ తెలంగాణకు ప్రత్యేకమైన పోచంపల్లి, గద్వాల్ చీర లు ధరించి ర్యాంపుపై వాక్ చేశారు.
యాదా ద్రి భువనగిరి జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పోచంపల్లి హ్యాండ్లూమ్ వస్త్రాలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మెరిశా రు. వందకు పైగా దేశాల ప్రతినిధులు చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించారు. అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన సుందరీమణులు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్‌తో ఆకట్టుకున్నారు.
ఇక యూరోప్ ఖండానికి చెందిన దేశాల ప్రతినిధులు గొల్లభామల చేనేత చీరలతో మెప్పించారు. యూనెస్కో గుర్తింపు పొందిన గొల్లభామల చేనేత వస్త్రాలతో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా యూరోపియన్ దేశా ల కంటెస్టెంట్లు మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోలో రాంప్ వాక్ చేశారు. మిస్ ఇండియా నందినిగుప్తా ఎరుపు రంగు పటోలా లెహంగాలో తళుక్కు మన్నారు. తెలంగాణ చేనేత వస్త్రాలతో డిజైన్లు చేయడం ఆనందంగా, గర్వంగా ఉందని డిజైనర్ అర్చనా కొచ్చారు చెప్పారు.
దీని ద్వారా చేనేత చీరలకు ప్రపంచవ్యాప్తం గా ఖ్యాతి దక్కుతుందని తెలిపారు. ఫ్యాషన్ ఫినాలేకు హాజరైన న్యాయ నిర్ణేతలు, ఆహుతులు తెలంగాణ సంప్రదాయబద్ధమైన డిజై న్లను చూసి ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుందరీమణులు స్థానిక చేనేతలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించటం ఆ డిజైన్లకు, తయారీదారులకు మంచి గుర్తింపును, మార్కెటింగ్ అవకాశాన్ని ఇస్తుందని అన్నారు.
పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలు ఖండించిన మిస్ వరల్డ్ సంస్థ చైైర్‌పర్సన్ జూలియా మోర్లే
హైదరాబాద్, మే 24 (విజయక్రాం తి): భారత్‌లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ 2025 మిల్లా మాగీ వైదొలగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారం లో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లే శనివారం స్పందించారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, మిస్ ఇంగ్లాండ్ మాగీ ఆరోపణలను ఖండించారు.
ఈ నెల ప్రారంభంలో, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తన తల్లి, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా ఈ పోటీల నుంచి విరమించుకోవాలని సంస్థను కోరినట్లు ఆమె తెలిపారు. మిల్లా పరిస్థితిని అర్థం చేసుకొని జూలియా మోర్లే వెంటనే స్పం దించి, ఆమె కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా పరిగ ణించారు.
తక్షణమే ఆమెను ఇంగ్లాండ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మిస్ మిల్లా మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలిగిన తర్వాత, మిస్ ఇంగ్లాండ్ 1వ రన్నరప్ అయిన మిస్ షార్లెట్ గ్రాంట్ ఆమె ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారని జూలియా మోర్లే ఆ ప్రకటనలో తెలిపారు. మిస్ షార్లెట్ బుధవారం ఇం డియాకు చేరుకున్నారని, మిస్ వరల్డ్ నిర్వాహకులు ఆమెను పోటీల్లో పాల్గొనుటకు అనుమతించడం జరిగిందని ఈ పోటీలలో ఆమె పాల్గొంటున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.
ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై, కొన్ని యూకే మీడియా సంస్థలు మిల్లా మాగీ పోటీలలో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు కథనాలను ప్రచురించినట్లు సంస్థకు తెలియడంతో ఆ ఆరోపణలను ఖండిస్తూ, ఆ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని జూలియా మోర్లే తెలిపారు. అందులో ఆమె ఆనందాన్ని, కృతజ్ఞతను, ఈ అనుభవాన్ని మెచ్చుకుంటూ మాట్లాడిన దృశ్యాలు కూడా ఉన్నాయి.
తాజాగా ప్రచురితమైన తప్పుడు కథనాలు నిరాధార మైన వని, ఆ ఆరోపణలను ఖండిస్తూ జూలి యా మోర్లే వివరించారు. మిస్ వరల్డ్ సంస్థ నిజాయితీ, గౌరవం, బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే విలువలకు నిబద్ధంగా పోటీలు కొనసాగుతున్నాయన్నారు. మీడియా సంస్థలు జర్నలిస్టిక్ విలువలు పాటిస్తూ, తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు తగు ఆధారాలతో, వివ రణతో ధ్రువీకరించుకోవాలని జూలి యా మోర్లే విజ్ఞప్తి చేశారు.