calender_icon.png 23 June, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవి క్లబ్ అంటేనే ఒక నమ్మకం

23-06-2025 01:12:29 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, జూన్ 22 (విజయక్రాంతి): వాసవి క్లబ్ అంటేనే ఒక నమ్మకమని, ఒక గొప్ప విశ్వాసం అని, సేవకు ప్రతి రూపం అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని మైత్రి హోటల్ కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ, ఇతర నేతల సమక్షంలో వీసీఐకి సంబంధించిన మూడు కార్యక్రమాలను బండి సంజయ్ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రారంభించారు.

జూలైలో జరుగబోయే మిడ్ కాన్ పిన్, 9 నగరాలలో అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన, భారత రక్షక దళాలకు కోటి రూపాయల ఫండ్ పథకాలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. జాతీయ జెండా, డిఫెన్స్ ఫండ్ గురించి కేంద్ర మంత్రికి ఇరుకుల్ల రామకృష్ణ వివరించగా ఆయన వీసీఐని అభినందించారు. భవిష్యత్ కార్యక్రమాలకు తన సహాయ, సహకారాలు ఉంటాయని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఐఈసీ ఆఫీసర్స్ ఇతర నేతలు, వాసవియన్లు 150 మంది పాల్గొన్నారు.