28 August, 2026 | 1:56 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

దళితులను అవమాన పరిచిన వీడీసీ

11-04-2026 02:23 AM

 చర్యలు తీసుకోవాలని ఏఎస్పీకి వినతి 

కామారెడ్డి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): దళితులను అవమాన పరిచిన రత్న గిరిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధులపై కేసు నమోదు చేయాలని శుక్రవారం కామారెడ్డి ఏ ఎస్ పి  చైతన్య రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రత్నగిరి పల్లి దళితులు మాట్లాడుతూ శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో దళిత కులానికి చెందిన వార్డు సభ్యుల దంపతులు కూర్చుంటామని పూజా సామాగ్రి కొనుగోలు చేసి ఇచ్చిన గ్రామ అభివృద్ధి కమిటీ కమిటీ సభ్యులు దళితులను శ్రీరామనవమి పూజలకు తెలియకుండానే కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారనీ ఏఎస్పీకి వివరించారు.

రత్నగిరి పల్లి గ్రామానికి చెందిన వీడీసీ పైన ఎస్సీ ఎస్టీ అడ్రస్ సీటు కేసు నమోదు చేయాలని రత్నగిరి పల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మల్లార రమేష్  సంకపల్లి శ్రీకాంత్ అంబేద్కర్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న  రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గైని రాజు, ఉపాధ్యక్షులు సురేష్  డిమాండ్ చేశారు. లేకపోతే అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు డిమాండ్ చేశారు.

దళితులను అవమానించిన రత్నగిరిపల్లి విడిసి పైన ఎస్సీ, ఎస్టీ ,అట్రాసిటీ  నమోదు చేయాలని ఏఎస్పి చైతన్య రెడ్డికి ఫిర్యాదు చేసిన రత్నగిరి పల్లి గ్రామ దళితులు. అంబేద్కర్ సంఘం నాయకులు.దళితులను ఎలాంటి పనులకు కూడా గ్రామంలో చెప్పొద్దని వీడిసి తీర్మానం చేసిందని, రత్నగిరి పల్లి విడిసి పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రత్నగిరి పల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మల్లరపు రమేష్, సంకపల్లి శ్రీకాంత్, అంబేద్కర్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, రాష్ట్ర ఉపాధ్య క్షులు ఆకుల బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గైని రాజు ఉపాధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు, లేకపోతే అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు డిమాండ్ చేశారు.