calender_icon.png 4 November, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి వేడుకలు

03-11-2025 01:38:34 AM

చేర్యాల, నవంబర్ 02:సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఆదివారం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 417 వ జయంతిని పురస్కరించుకొని మహామాయ దేవి ఆలయంలో కొలువుదీరిన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వబ్రాహ్మణ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష అభిషేకం, అర్చనలు, స్వామివారి మూల మంత్ర హోమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మే ర్గోజు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రాళ్లబండి భాస్కర్, గౌరవాధ్యక్షులు రాళ్లబండి నాగరాజు, పోలోజు శ్రీహరి, మేర్గోజు నారాయణ, మేర్గోజు రామచంద్రం, వినోద్, మేర్గోజు జనార్ధన్, మేర్గోజు మహేష్ తదితరులు పాల్గొన్నారు.