calender_icon.png 4 November, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ

04-11-2025 11:33:22 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హతా పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) విచారణ చేస్తున్నారు. మరో నలుగురి పిటిషన్లపై విచారణకు సభాపతి షెడ్యూల్ ఇచ్చారు. అనర్హతా పిటిషన్లపై ఈ నెల 6,7, 12,13 తేదీల్లో విచారించనున్నారు. మొదటి పిటిషనర్లు.. తర్వాత ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. రోజుకు ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణకు స్వీకరించారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్..

నవంబర్ 6న తెల్లం వెంకట్రావ్, సంజయ్ ల పిటిషన్ల విచారణ. 

నవంబర్ 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆరికెపూడి గాంధీల పిటిషన్ల విచారణ.

నవంబర్ 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్ ల పిటిషన్లపై రెండోసారి విచారణ. 

నవంబర్ 13న పోచారం, ఆరికెపూడి గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ..