03-11-2025 01:39:43 AM
పెద్దశంకరంపేట (మెదక్), నవంబర్ 2 :పెద్దశంకరంపేట మండలం వీరోజిపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి జూదం ఆడుదున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరోజిపల్లి గ్రామ పరిధిలోని టాడీ షాప్ సమీప ప్రాంతంలో బొమ్మా బోరుసు (జూదం) ఆడుతున్న వ్యక్తులపై దాడి నిర్వహించారు.
ఈ దాడిలో మొత్తం 6 మంది జూదగాళ్లను అదుపులోకి తీసుకొని, వారివద్ద నుండి రూ. 17,709 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని పెద్దశంకరంపేట్ పోలీస్ స్టేషన్కు అప్పగించగా, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.