calender_icon.png 4 November, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోయంబత్తూరులో విద్యార్థినిపై లైంగిక దాడి.. ముగ్గురు నిందితులు అరెస్ట్

04-11-2025 10:49:52 AM

కోయంబత్తూర్: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ విమానాశ్రయం(Coimbatore Airport) సమీపంలో ఒక కళాశాల విద్యార్థినిపై(Student) ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధురైకి చెందిన యువతి, ప్రస్తుతం కోయంబత్తూర్‌లో చదువుతోంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో విమానాశ్రయానికి సమీపంలోని బృందావన్ నగర్ సమీపంలో తన స్నేహితుడితో కారులో కూర్చొని ఉండగా, ఆ ముగ్గురూ వాహనం వద్దకు వచ్చి, ఆమె సహచరుడిపై కత్తితో దాడి చేశారు. దీంతో అతను సృహ కోల్పోయాడు. ఆ తర్వాత దుండగులు బాధితురాలిని ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ లైంగిక దాడి చేసి, అక్కడి నుండి పారిపోయారు. గాయపడిన ఆమె స్నేహితుడు కొంత సమయం తర్వాత స్పృహ తిరిగి సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె ప్రియుడిని హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ శరవణ సుందర్ వెల్లడించారు. కోయంబత్తూరు నగర శివార్లలోని వెల్లకినారులో నిందితులు అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, పోలీసులు వారిపై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. గాయపడిన నిందితులు గుణ, కరుప్పసామి, కార్తీక్ అలియాస్ కాళీశ్వరన్ గా గుర్తించారు. నిందితులందరినీ కోయంబత్తూరు జీహెచ్ ఆస్పత్రికి పంపారు. ఈ కాల్పుల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడినట్లు కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.